Wednesday, March 26, 2025
HomeTrending NewsIndonesia: ఇండోనేషియాలో పడవ ప్రమాదం..15 మంది మృతి

Indonesia: ఇండోనేషియాలో పడవ ప్రమాదం..15 మంది మృతి

ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలోని సముద్రంలో పడవ మునిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గల్లంతయ్యారు.

ఆగ్నేయ సువలేసి ప్రావిన్స్ రాజధాని కేందారీకి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునా ద్వీపంలోని ఒక బే గుండా ఈ నౌక ప్రయాణికుల్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఆరుగురు ప్రాణాలతో బటయడినట్లు ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం నుంచి బయటపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్