Monday, February 24, 2025
HomeTrending Newsజీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు నోటిఫికేషన్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్‌ విధానం అమలుచేస్తామన్నారు. ఇప్పటివరకు బస్తీదవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామన్నారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నాయని తెలిపారు.

బస్తీ దవాఖానల్లో ఉచితంగా లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానలతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై ఓపీ భారం తగ్గిందని చెప్పారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూటిషన్‌ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్