ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేసింది. మొదటగా హెచ్ ఓ డిల బదిలీలు చేసిన ప్రభుత్వం ఈసారి జిల్లాల కలెక్టర్లను మార్చింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారని భావించిన వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
- గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ (ప్రస్తుతం విజయనగరం కలెక్టర్)
- గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం
- విశాఖ కలెక్టర్ మల్లికార్జున మల్లికార్జునను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం.. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు..
- అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం (ప్రస్తుతం ప్రకాశం కలెక్టర్)
- అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ – జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
- కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ (ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్)
- కాకినాడ కలెక్టర్ జే నివాస్ ను జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
- ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి (ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖా డైరెక్టర్)
- ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
- తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం (ప్రస్తుతం అగ్రికల్చర్ డైరెక్టర్)
- తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీ లతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
- విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ నియామకం (ప్రస్తుతం మిడ్ డే స్కూల్స్ డైరెక్టర్)
- పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి (ప్రస్తుతం టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్)
- చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ (ప్రస్తుతం వెస్ట్ గోదావరి కలెక్టర్)
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన (ప్రస్తుతం కలెక్టర్)
- ఎన్టీఆర్ కలెక్టర్ ఢిల్లీ రావును జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
- ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా (ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్)
- బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలుకు బదిలీ, బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు