Wednesday, April 2, 2025
Homeఅంతర్జాతీయంపాక్ లో రోడ్డు ప్రమాదం – 18 మంది దుర్మరణం

పాక్ లో రోడ్డు ప్రమాదం – 18 మంది దుర్మరణం

పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది చనిపోయారు. బెలుచిస్థాన్ ప్రావిన్సు లోని ఖుజ్దర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న బస్సును రోడ్డు మలుపు వద్ద డ్రైవర్ అదుపు చేయలేక పోవటం వల్లే దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. సుమారు 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సింద్ రాష్ట్రానికి చెందిన యాత్రికులు బెలుచిస్థాన్ వాద్ పుణ్య క్షేత్రంలో జరుగుతున్న ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్