Tuesday, March 19, 2024
HomeTrending NewsHaj: హజ్ యాత్రకు సర్వం సిద్ధం: డిప్యూటి సిఎం

Haj: హజ్ యాత్రకు సర్వం సిద్ధం: డిప్యూటి సిఎం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హజ్ 2023 యాత్రకు  ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా వెల్లడించారు. గుంటూరు-విజయవాడ రహదారిపై నంబూరు గ్రామంలో అంధ్రప్రదేశ్ హజ్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులకు ఆయన స్వాగతం పలికారు

ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలిసారిగా విజయవాడ నుంచి హాజిలు పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడకు ఎంబారిగేషన్ పాయింటు వచ్చినా టికెట్ ధర వ్యత్యాసం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఈ విషయాన్ని తాను, హజ్ కమిటి చైర్మన్… సిఎం జగన్ దృష్టికి తీసికుని వెళ్ళగానే ఈ  వ్యత్యాస ధరను ప్రభుత్వం తరఫున భరించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు.

బుదవారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ  విమానాశ్రయం నుంచి మొదటి విమానం  బయలుదేరుతుందని చెప్పారు. హజ్ హౌసునుంచి ఉదయం 5 గంటలకు హాజిల బస్సులు గన్నవరం వెళతాయని, హాజిల లగేజితో మరో రెండు వాహనాలు అనుసరిస్తాయని వివరించారు. హజ్ హౌసులోనే ఇమిగ్రేషన్, లగేజి వెరిఫికేషన్ పనులన్నీ ముగించుకుని యాత్రికులు నేరుగా విమానం దగ్గరకు వెళ్ళేలా ఏర్పాట్లు చేశామన్నారు. హజిలకు ఎటువంటి అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించాలని  అంజాద్ బాషా కోరారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానుమ్ , ఆంద్రప్రదేశ్ స్టేట్ ఉర్దు అకాడమి చైర్మన్ నదీం అహమ్మద్, ఆంద్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్  చైర్మన్ అసిఫ్ అలీ, ఆంధ్రప్రదేశ్ వేర్ హోసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కరిముల్లా, ఎమ్మెలేలు మొహమ్మద్ ముస్తఫా, మొహమ్మద్ నవాజ్ బాషా, కిలారి రోశయ్య, ఎమ్మెల్సీలు ఇషాక్ బాషా, మొహమ్మద్ రూహుల్లా, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటి వ్యవహరాల ప్రత్యేక కార్యదర్శి ఏఎండి ఇంతియాజ్, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటి వ్యవహరాల సలహాదారులు ఎస్ ఎం జియాఉద్దీన్ , ముఫ్తి సయ్యద్ షా అలీ బాగ్దాది తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్