Tuesday, March 10, 2026
HomeTrending Newsదళితబంధుకు 250 కోట్ల నిధులు విడుదల

దళితబంధుకు 250 కోట్ల నిధులు విడుదల

దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న తెలంగాణ దళితబంధు పథకం కోసం సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం లోని తిర్మలగిరి మండలానికి, రూ. 50 కోట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular