Wednesday, January 22, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్26, 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీకా

26, 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీకా

అమరావతి: ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్‌ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ, శాసనమండలి కార్యక్రమాలకు హాజరయ్యే పత్రికా విలేకరులు ఈ నెల 27న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ టీకా వేయించుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్