Thursday, January 23, 2025
Homeతెలంగాణ27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు..

27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు..

27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు..

ఒకటి నుండి 9 వ తరగతి వరకు అందరూ ప్రమోట్

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు… రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు.

కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.

అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు.

పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు.

ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్