Tuesday, January 21, 2025
Homeస్పోర్ట్స్India Open-2023: రెండో రోజు ఇండియాకు నిరాశ

India Open-2023: రెండో రోజు ఇండియాకు నిరాశ

యొనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ -2023లో రెండోరోజు ఇండియాకు కలిసి రాలేదు. స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తో పాటు సింగల్స్, డబుల్స్ లో మిగిలిన ఆటగాళ్ళు విఫలమయ్యారు. నేడు ఒక్క విజయాన్ని కూడా ఇండియా ప్లేయర్లు నమోదు చేయలేకపోయారు.

పురుషుల సింగల్స్ లో కిడంబి శ్రీకాంత్ 14-21; 19-21 తేడాతో డెన్మార్క్ విక్టర్ అలెక్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సోద్ పై థాయ్ లాండ్ ప్లేయర్ బుసానన్ 21-17;21-12 తో; ఆకర్షి కాశ్యప్ పై అమెరికా క్రీడాకారిణి బిడబ్ల్యూ ఝాంగ్ 21-15;21-12 తేడాతో గెలుపొందారు.

మహిళల డబుల్స్ లో అశ్విని భట్- శిఖా గౌతమ్ జోడీపై మలేషియా టాన్ పెర్లీ- తిన్నా మురళీతరన్ 21-8;21-11 తేడాతో గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్