Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

shanaaa kastam: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్  మేకర్స్ అనౌన్స్ చేశారు. అది ఏంటంటే.. ఈ చిత్రం నుండి సానా కష్టం.. అనే లిరికల్ వీడియో సాంగ్ ను జనవరి 3వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రక‌టించారు. అంతే కాకుండా.. ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 2022 ను ఈ హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ తో స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే..  రామ్ చరణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ఈ క్రేజీ మూవీని ఫిబ్రవ‌రి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com