Thursday, March 12, 2026
Homeసినిమా‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ‘ఏదో ఏదో’ లిరికల్ వీడియో

‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ‘ఏదో ఏదో’ లిరికల్ వీడియో

Shyam Singh Roy: Edo Edo Song:
న్యాచులర్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి వస్తున్న ప్రతీ అప్ డేట్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ బ్యానర్ పై  నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ భారీగా ఉపయోగిస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఈ గ్యాప్‌లో సినిమా ప్రమోషన్స్‌ ను వేగవంతం చేశారు.

మ్యూజిక్ ప్రమోషన్స్‌ లో భాగంగా సెకండ్ సింగిల్ ‘ఏదో ఏదో’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాని, కృతి శెట్టిల మీద రూపొందించిన ఈ మెలోడి సాంగ్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకున్న మిక్కీ జే మేయర్.. ఇప్పుడు మెలోడి ట్యూన్‌ ఇచ్చారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను.. చైత్ర అంబడిపుడి ఆలపించారు. మెలోడి ట్యూన్, అద్బుతమైన గాత్రం, ఆకట్టుకునే సాహిత్యంతో పాటు నాని, కృతి శెట్టిల రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటలోనే లిప్ లాక్ కూడా కనిపిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వెరైటీ ట్యూన్స్ ఇవ్వడంతో మిక్కీ జే మేయర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు… జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, యశ్ మాస్టర్ కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది .

Also Read : డిసెంబర్ 24న నాని ‘శ్యామ్ సింగ రాయ్’విడుద‌ల‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular