Thursday, May 9, 2024
HomeTrending Newsమూడు దేశాలను వణికించిన జంట భూకంపాలు

మూడు దేశాలను వణికించిన జంట భూకంపాలు

Magnitude 6.3 Earthquake Shakes Three Countries Including India :

భారత ఈశాన్య ప్రాంతంలో జంట భూకంపాలు ఈ రోజు(గురువారం) తెల్లవారు జామున సంభవించాయి. భారత్ సహా రెండు దేశాలను వణికించాయి. వాటి తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ మూడు దేశాల సరిహద్దుల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపాల వల్ల కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అందుతోన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు తెలియరావట్లేదు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అధికారులు పేర్కొన్నారు.

తొలుత- బంగ్లాదేశ్‌లోని సరిహద్దుల్లోని చిట్టాగాంగ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. చిట్టాగాంగ్ నగరం  భారత్-మయన్మార్ సరిహద్దు రీజియన్ పరిధిలోకి వస్తుంది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉంటుంది. ఫలితంగా సునామీ ఆందోళనలు మొదట్లో వెలువడ్డాయి. సునామీ రావడానికి అవకాశం లేదంటూ యూరోపియన్ మిడ్‌టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. సునామీ సంభవించే అవకాశం లేదని స్పష్టం చేసింది

చిట్టాగాంగ్ నగరానికి తూర్పున 174 కిలోమీటర్ల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నిర్ధారించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. దీని తీవ్రత పొరుగునే ఉన్న అస్సాంలోని గౌహతి, మయన్మార్‌లోనూ కనిపించినట్లు యూరోపియన్ మిడ్‌టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ స్పష్టం చేసింది. ఆ తరువాత 10 నిమిషాలకు మరో భారీ భూకంపం ఈశాన్య రాష్ట్రం మిజోరంలో చోటు చేసుకుంది. తెల్లవారు జామున 5:15 నిమిషాలకు మిజోరంలోని టెంజ్వాల్‌లో ఇది సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. టెంజ్వాల్ నగరానికి ఆగ్నేయ దిశగా 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న ఫలకాల కదలికల వల్ల భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్