ఇండియా – శ్రీలంక మధ్య రెండో టి-20 మ్యాచ్ నేడు నిర్వహిస్తారు, చివరి మ్యాచ్ రేపు జరగనుంది. కృనాల్ పాండ్యాకు కోవిడ్ నిర్ధారణ కావడంతో నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేడు మ్యాచ్ ను నిర్వహించాలని నిర్ణయించారు. కృనాల్ తో పాటు అతనికి సన్నిహితంగా ఉన్న ఏడుగురు ఆటగాళ్ళు హార్ధిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్, మనీష్ పాండే, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, గౌతమ్ లు మిగతా రెండు మ్యాచ్ లు ఆడబోవడం లేదు. వారిని హోటల్ గదిలో ఐసోలేషన్ కే పరిమితం చేయాలని ఇండియా జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. నేటి మ్యాచ్ నిర్వహణను బిసిసిఐ కూడా నిర్ధారించింది.
మూడు వన్డేలు, మూడు టి-20మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు ఇండియా జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఇండియా టి-20 మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది.