ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు 300 కోట్ల మార్క్ దాటాయి. అంటే ప్రపంచ జనాభాలో కాస్త అటు ఇటుగా 40 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు. మొదటి, రెండో డోసు కలిసిన గణాంకాల ప్రకారం ఈ లెక్క. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం తాజాగా విరుచుకుపడుతున్న డెల్టా వేరియంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు డోసులు వేసుకున్నా, కరోనా కేసులు ఉన్నా, లేకున్నా మాస్కులు ధరించాల్సిందేనని, వీలయినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. ఏ దేశంలోనూ కరోనా నూటికి నూరు పాళ్లు మాయం కాలేదు కాబట్టి మరి కొంతకాలం మాస్కులు, జాగ్రత్తలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ ఎంత రక్షణ ఇవ్వగలదో మాస్కు కూడా అంతకు మించిన రక్షణ ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు. కనీసం ఇంకో సంవత్సరం దాటితేగానీ ప్రపంచమంతా వంద శాతం పూర్తయ్యేలా లేదు.