బిపర్ జాయ్ తీవ్రతకు పాకిస్థాన్ సింద్ రాష్ట్రంలో అల్లకల్లోలంగా ఉంది. తుపాను ధాటికి భారీ వర్షాలతో పాకిస్థాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పెనుగాలులు, పిడుగులతో కురిసిన వర్షాల కారణంగా ఈశాన్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో 34 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రావిన్సియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (పీడీఎంఏ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం కురిసిన భారీ వర్షాలకు గోడలు కూలి, చెట్లు పడిపోయి దక్షిణ జిల్లాల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయి.