Sunday, November 10, 2024
Homeస్పోర్ట్స్IND (W)- BAN (W): మూడో వన్డే టై - సిరీస్ డ్రా

IND (W)- BAN (W): మూడో వన్డే టై – సిరీస్ డ్రా

చివరి ఓవర్లలో బంగ్లా బౌలర్లు సత్తా చాటడంతో ఇండియా- బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య నేడు జరిగిన ఆఖరి వన్డే టై గా ముగిసింది. తొలి రెండు మ్యాచ్ లూ చెరొకటి గెలవడంతో సిరీస్ డ్రా గా ముగిసింది. ఇండియా విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన దశలో 46వ ఓవర్లో 6;  47వ ఓవర్లో నాలుగు రన్స్ తో పాటు ఒక వికెట్ కోల్పోయింది, జేమైమా రోడ్రిగ్యూస్ కు సహకారం అందిస్తూ వచ్చిన అమన్ జోత్ ఈ ఓవర్లో రాబెయా ఖాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగింది. 48 వ ఓవర్లో నహీదా అక్తర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది.  స్నేహ్ రానా, దేవికా వైద్య డకౌట్ గా వెనుదిరిగారు. ఈ రెండూ కాట్ అండ్ బౌల్డ్ వికెట్లు కావడం విశేషం. అప్పటికి స్కోరు 223/9.

49 వ ఓవర్లో మేఘనా సింగ్ ఒక బౌండరీ సాధించగా మొత్తం ఆరు పరుగులొచ్చాయి.

మరూఫా అక్తర్ వేసిన చివరి ఓవర్లో విజయానికి మూడు పరుగులు అవసరం కాగా మొదటి రెండు బంతులకు మేఘనా సింగ్, ర్రోడ్రిగ్యూస్ చెరో రన్ సాధించారు. అప్పటికి స్కోరు సమం అయ్యింది. మూడో బంతికి నైగర్ సుల్తానా పట్టిన అద్బుత క్యాచ్ కు మేఘనా ఔట్ కావడంతో ఇండియా ఆలౌట్ అయ్యింది. దీనితో మ్యాచ్ టై గా ముగిసింది.

షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేయగా ఇండియా   49.5  ఓవర్లలో225  పరుగులకు ఆలౌట్ అయ్యింది,

బంగ్లాదేశ్ తొలి వికెట్ కు 93 పరుగులు చేసింది. ఓపెనర్ షామీనా సుల్తానా 52 రన్స్ చేసింది. కెప్టెన్ నైగర్ సుల్తానా-24; రీతూ మొనీ- 2 పరుగులు చేసి వెనుదిరిగారు. మరో ఓపెనర్ ఫర్గానా హక్ 160 బంతుల్లో 7 ఫోర్లతో 107 రన్స్ సాధించి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ గా ఔటయ్యింది. శోభనా మోస్త్రీ 23 రన్స్ తో నాటౌట్ గా నిలిచింది.

ఇండియా బౌలర్లలో స్నేహ్ రానా 2; దేవికా వైద్య ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో ఇండియా 32  పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ (4), యస్తికా భాటియా(5) విఫలమయ్యారు.  ఈ దశలో స్మృతి మందానా- హర్లీన్ డియోల్ లు మూడో వికెట్ కు 107 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. మందానా 59 రన్స్ చేసి వెనుదిరిగింది. కెప్టెన్ హర్మన్ 14 పరుగులు చేసి ఔటయ్యింది.  హర్లీన్ డియోల్ రాణించి 77 పరుగులు చేసి జట్టు స్కోరు 191వద్ద రనౌట్ అయ్యింది. అమన్ జోత్ -10, మేఘనా సింగ్-6 పరుగులు చేయగా, దీప్తి శర్మ, స్నేహ్ రాణా(0), దేవికా విద్యా(0) విఫలమయ్యారు. రోడ్రిగ్యూస్ 33  పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

సెంచరీ సాధించిన ఫర్గానా హక్ కు ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించగా… ఇండియా ప్లేయర్ హర్లీన్ డియోల్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్