డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రం కోసం కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు.

రొమాంటిక్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ‘పీనే కే బాద్’ అంటూ మూడో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. బాధల్లో ఉన్నప్పుడు, మద్యం సేవించిన అనంతరం ఉండే ఆ ఎనర్జీని చూపించేలా ఈ పాట సాగుతుంది. పాట థీమ్‌కు తగ్గట్టుగా ఓ పబ్‌లో ఈ పాటను షూట్ చేశారు. క్లబ్‌లో ఈ పాటను షూట్ చేస్తున్న సమయంలోనే అద్భుతమైన ఆదరణ వచ్చింది.

ఈ పాటను భాస్కర భట్ల, పూరి జగన్నాథ్ ఎంతో హాస్యధోరణిలో రాశారు. అందరికీ రీచ్‌ అయ్యేలా క్యాచీ ట్యూన్‌ను సునీల్ కశ్యప్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ప్లస్ అవుతుంది. ఆకాష్ పూరి డ్యాన్సులు కొత్తగా ఉన్నాయి. యూత్, మాస్ ఆడియెన్స్‌ కు ఈ పాట తప్పకుండా కనెక్ట్ అవుతుంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘రొమాంటిక్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి నరేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *