Thursday, June 11, 2026
HomeTrending News33 బీసీ గురుకులాలు అక్టోబర్ 11న ప్రారంభం

33 బీసీ గురుకులాలు అక్టోబర్ 11న ప్రారంభం

సీఎం కేసీఆర్ బీసీల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుంచి, నూతన డిగ్రీ కళాశాలలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం గురుకులాలు, డిగ్రీ కళాశాల ఏర్పాటుపై మంత్రి తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వీటిని నెలకొల్పుతున్నామని, స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

గతంలో సీఎం హామీనిచ్చిన విధంగా హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలన్నారు. ఈ నూతన గురుకులాలతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరింది.

ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 41 కులసంఘాలకు 95.25కోట్లు, కోకాపేట, ఉప్పల్ బగాయత్‌లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమై పట్టాలు పొందాయన్నారు.

మిగతా సంఘాల్లో సైతం ఏకగ్రీవాలు జరుగుతున్నాయని, ఇలా ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్న 80,025 ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లు మరింత విస్తృతంగా అభ్యర్థులకు సేవలు అందించాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు.

12 స్టడీ సర్కిళ్లకు అదనంగా అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. వీటి ద్వారా దాదాపు 25వేల మందికి పైగా నేరుగా లబ్దీ చేకూరుతుందన్నారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మల్లయ్యబట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సంధ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణలో మరో 33 బీసీ గురుకులాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular