Wednesday, March 11, 2026
Homeసినిమా'7 డేస్ 6 నైట్స్' గోవా షెడ్యూల్ పూర్తి

‘7 డేస్ 6 నైట్స్’ గోవా షెడ్యూల్ పూర్తి

విభిన్నమైన థ్రిల్లర్ ‘డర్టీ హరి’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, ‘7 డేస్ 6 నైట్స్’ అనే యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. అయితే.  రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవాలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కెమెరాలతో ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎం. ఎస్. రాజు. తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు, ఉడుపికి వెళుతున్న మూవీ టీం, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ… “ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాక, దర్శకుడిగా నేను తీసిన డర్టీ హరి లాంటి థ్రిల్లింగ్ కథ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఎనర్జీనిచ్చింది. అందుకే రెట్టింపు ఉత్సాహంతో మా ‘7 డేస్ 6 నైట్స్’ ని చిత్రీకరిస్తున్నాం. విభిన్నమైన కథనం – సన్నివేశాలతో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అని అన్నారు.

“ఒక వైపు చిత్రీకరణ చివరి దశలో ఉండగా మరో వైపు నిర్మాణంతర కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నాం. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలో ఆసక్తికరమైన రెండో పోస్టర్ కూడా విడుదల చేయనున్నాం” అని చిత్ర కో- ప్రొడ్యూసర్ జె. శ్రీనివాసరాజు అన్నారు.

మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకం పై ఎం. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular