Sunday, July 26, 2026
HomeTrending Newsభారీగా తగ్గిన కొత్త కేసులు

భారీగా తగ్గిన కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు సుమారు ఐదు నెలల కనిష్ఠానికి చేరాయి. ముందురోజుతో పోల్చితే 23.5 శాతం మేర తగ్గాయి. అదే సమయంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. తాజాగా మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
⇒ నిన్న 15,63,985 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,166 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. గత కొద్దికాలంగా కేరళలో నిత్యం 20వేల కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా అవి 12 వేలకు పడిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular