Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మెగా మేకర్ ఎం.ఎస్ రాజు న్యూ ఏజ్ ఫిల్మ్ ‘7 డేస్ 6 నైట్స్’ టీం క్లిష్ట పరిస్థితుల మధ్య రికార్డు సమయంలో షూట్  పూర్తి చేశారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీమ్ తో, 4 కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడుపిలో చివరి షెడ్యూల్ కూడా పూర్తి చేశారు పోస్ట్ ప్రొడక్షన్ , డబ్బింగ్ పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ “అనుకున్న దాని కంటే త్వరగా అద్భుతంగా చిత్రం పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదల, క్రమశిక్షణ తో పని చేసిన నా టీమ్ కి చాలా థాంక్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం రానుంది. మా అబ్బాయిని ఈ చిత్రం తో నిర్మాతగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ తో హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది మా ‘7 డేస్ 6 నైట్స్’ కథ” అని అన్నారు.

హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “నా కేరీర్ లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది. మా నాన్నగారికి ఫిల్మ్ మేకింగ్ మీదున్న ప్యాషన్ నాకు చాలా స్పూర్తినిస్తోంది.  నిర్మాణం అయినా.. దర్శకత్వం అయినా.. ఎంతో పట్టుదలతో… అంతే ఇష్టంతో నిర్వర్తిస్తారు. మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వచ్చిన ఎన్నో క్లాసిక్ హిట్స్ మధ్య ఈ చిత్రం కూడా చేరనుంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా వింటేజ్ పిక్చర్స్, ఏ.బి.జి క్రియేషన్స్ వారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పారు.

అదే సమయంలో కో-ప్రొడ్యూసర్ జె. శ్రీనివాస రాజు మాట్లాడుతూ “మా  ఎం.ఎస్ రాజు దర్శకుడిగా ‘డర్టీ హరి’ తో బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మరో సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ అందిస్తున్నారు. రికార్డు టైం లో షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ పనుల్లో నిమగ్నమయున్నాం, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com