వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ఇండియన్ అమెరికన్ బరిలో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు భారత సంతతికి చెందిన సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, పారిశ్రామిక వేత్త వివేక్ రంగస్వామి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా తాను కూడా పోటీకి దిగుతున్నట్టు ఏరోస్పేస్ ఇంజినీర్ హర్షవర్ధన్ సింగ్ గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయన అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. 2020లో ఆయన సెనేట్‌కు పోటీచేసి ఓటమిపాలయ్యారు.
సహచర రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ‘గ్రేటెస్ట్ ప్రెసిడెంట్’ అంటూ కొనియాడిన హర్షవర్ధన్.. దేశానికి మరింత సేవ చేసేవారి అవసరముందని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి చాలా మంది అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. వారిలో ట్రంప్‌తోపాటు న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, దేశ మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రామస్వామి, హేలీ, సెనేటర్ టిమ్‌స్కాట్, పాస్టర్ ర్యాన్ బిన్లే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 59 శాతం మంది ట్రంప్‌కు మద్దతునిస్తుండగా, డిశాంటిస్‌కు 16 శాతం, రామస్వామికి 8 శాతం, పెన్స్‌కు 6 శాతం, స్కాట్‌కు 2 శాతం మంది మద్దతు తెలుపుతున్నారు.