Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్The Ashes: ఇంగ్లాండ్ 389/9

The Ashes: ఇంగ్లాండ్ 389/9

కెన్నింగ్టన్ టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 389 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.  తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కంటే 12 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ నేడు మొదలు పెట్టిన ఇంగ్లాండ్ మొదటి వికెట్ కు 79 పరుగులు చేసింది. జట్టులో జో రూట్ 91 పరుగులతో రాణించాడు. బెయిర్ స్టో-78;  ఓపెనర్ జాక్ క్రాలే -73;  బెన్ డకెట్-42; కెప్టెన్ బెన్ స్టోక్స్ 42; మోయిన్ అలీ-24 పరుగులు చేశారు.  జో రూట్- బెయిర్ స్టో ఐదో వికెట్ కు  110 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4; టాడ్ మర్ఫి 3; హాజేల్ వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్టువార్ట్ బ్రాడ్-2; జేమ్స్ అండర్సన్- 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 377 పరుగుల ఆధిక్యంలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్