లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమావేశం నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చను ఈ నెల 8న చేపట్టి 10న ప్రధాని సమాధానంతో ముగిస్తామని వెల్లడించారు. అయితే వెంటనే తీర్మానంపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
వెంటనే ప్రవేశపెట్టాలన్న నిబంధనలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో విపక్షాలు మండిపడ్డాయి. 16వ లోక్‌సభలో కేంద్రం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన మరుసటి రోజే చర్చ చేపట్టిందని కాంగ్రెస్ నాయకుడొకరు గుర్తు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి.