Friday, April 25, 2025
HomeTrending Newsఆర్థిక శాఖ ఉద్యోగుల సస్పెండ్

ఆర్థిక శాఖ ఉద్యోగుల సస్పెండ్

ఆర్థిక శాఖలో ముగ్గురు ఉగ్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లీక్ చేస్తున్నారంటూ వారిపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో  అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసుర్లు వరప్రసాద్, శ్రీనుబాబు ఉన్నారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూదదంటూ ప్రభుత్వం ఆదేశించింది.

కొంతకాలంగా రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని, భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాని వివరణ అడిగింది. ఈ విషయంలో కొన్ని కీలక డాక్యుమెంట్లను ఆర్ధిక శాఖ సిబ్బంది లీక్ చేశారని ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వారిపై వేటు వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్