Friday, March 29, 2024
Homeసినిమా'లక్కీ స్టార్'గా వస్తున్న యష్

‘లక్కీ స్టార్’గా వస్తున్న యష్

కె.జి.ఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యష్ హీరోగా కన్నడంలో ఘన విజయం సాధించిన ‘లక్కీ’ సినిమా తెలుగులో “లక్కీ స్టార్”గా రాబోతోంది. ఈ చిత్రాన్ని కన్నడంలో నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోంది.

నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ… “కన్నడలో యష్ కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో ‘లక్కీ’ ఒకటి. యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, ‘రాబర్ట్’ ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. సీనియర్ రైటర్ గురుచరణ్ తెలుగులో మాటలతో పాటు పాటలు కూడా రాశారు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అనువాద కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం” అన్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: ధీరజ్-అప్పాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: కేశవ్ గౌడ్, కూర్పు: దీపు ఎస్. కుమార్, ఛాయాగ్రహణం: కృష్ణ, సంగీతం: అర్జున్ జన్య (రాబర్ట్ ఫేమ్), బ్యానర్: శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్, సమర్పణ: రాధికా కుమారస్వామి, నిర్మాత: రవిరాజ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డాక్టర్ సూరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్