సిడ్నీ వేదికగా జరుగుతోన్న బ్యాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023, పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ రన్నరప్ గా నిలిచాడు. ఈరోజు జరిగిన ఫైనల్స్ లో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యంగ్ 21-9; 23-21; 22-20 తో ప్రణయ్ పై విజయం సాధించాడు.
మొదటి సెట్ ను భారీ తేడాతో కోల్పోయిన ప్రణయ్ రెండో సెట్ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించి హోరాహోరీగా తలపడి 23-21తో సెట్ గెల్చుకున్నాడు. మూడో సెట్ కూడా నువ్వా-నేనా అన్న రీతిలో సాగించి చివరకు విజయం వెంగ్ హాంగ్ నే వరించింది.