Friday, September 20, 2024
HomeTrending NewsBalochistan: బలూచిస్థాన్‌ లో మందుపాతర పేలుడు...ఏడుగురు మృతి

Balochistan: బలూచిస్థాన్‌ లో మందుపాతర పేలుడు…ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్ లో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ లు ఏ మాత్రం అవకాశం చిక్కినా తమ ఉనికి చాటుకుంటున్నాయి. పాక్ మిలిటరీ, నిఘా వర్గాలు టార్గెట్ గా దాడులు చేసే మిలిటెంట్ గ్రూప్ లు ప్రభుత్వానికి మద్దతు తెలిపే వారిపై కూడా దాడులకు దిగుతున్నాయి.

తాజాగా ఇదే తరహాలో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో భారీపేలుడు సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ కౌన్సిల్ (UC) చైర్మన్‌ ఇష్తియాక్ యాకూబ్‌తో, సహా ఏడుగురు మరణించారు. గత రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన ఇష్తియాక్.. తన కారులో తిరుగుపయణమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు చేరుకోగానే మందపాతరను పేల్చారు. దీంతో ఇష్తియాక్‌ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు దవాఖానలో చికిత్సపొందుతూ చనిపోయారని పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో చెప్పారు.

2014, సెప్టెంబరులో ఇదే ప్రాంతంలో ఇష్తియాక్ తండ్రి యాకుబ్ బల్గాత్రి, అతని సహచరులు 10 మంది హత్యకు గురయ్యారు. నాటి దాడికి బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) బాధ్యత వహించింది. తాజా పేలుడుకు కూడా ఆ సంస్థే పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్