Wednesday, June 17, 2026
Homeసినిమాగ్రాండ్ గా 'దసరా' 100 డేస్ షీల్డ్స్ ప్రెజెంటేషన్ ఈవెంట్

గ్రాండ్ గా ‘దసరా’ 100 డేస్ షీల్డ్స్ ప్రెజెంటేషన్ ఈవెంట్

నాని నటించిన పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’. ఇప్పటివరకు నాని నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన చిత్రమిది. ఈ భారీ మాస్ మూవీ 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.నానిలోని మరో యాంగిల్ ని బయటకు తీసి  అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఒదెల ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యాడు.

ఈ చిత్రం సంచలన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. హీరో నానితో పాటు  నిర్మాతలు అనిల్ సుంకర, నాగ వంశీ, సాహు గారపాటి, గోపి అచంట హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సెన్సేషనల్ ఆల్బమ్ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular