Tuesday, June 16, 2026
HomeసినిమాWar 2: ఎన్టీఆర్ పాత్రపై సర్వత్రా ఆసక్తి

War 2: ఎన్టీఆర్ పాత్రపై సర్వత్రా ఆసక్తి

ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఒక్కసారిగా ఆయన ఇమేజ్, క్రేజ్ మొత్తం మారిపోయాయి.  బాలీవుడ్ నుంచే కాదు.. హాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్ కు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తున్నాడు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న దేవర రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ మూవీ తర్వాత వార్ 2 చేయనున్నారు. ఇది బాలీవుడ్ మూవీ. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించబోతుండడం విశేషం. ఈ భారీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరిలో ఈ భారీ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. దీపికా పడుకునే, ఆలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ ఇద్దరు కన్ ఫర్మ్ అని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే… ఇందులో ఎన్టీఆర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. అలాగని విలన్ పాత్ర కాదట. ఒక లక్ష్యంతో అలా ప్రవర్తిస్తాడట. అతని గతం ఎవరూ ఊహించని విధంగా.. చాలా సర్ ఫ్రైజ్ గా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే.. ఈ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ లో ప్రారంభమయ్యే ఈ సినిమాను 2025 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. యష్‌ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular