ఐసిసి వన్డే వరల్డ్ కప్-2023లో ఇండియా-పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15 న జరగాల్సిన మ్యాచ్ ముందురోజు 14 కు మార్చారు. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఇండియాలో అత్యంత పవిత్రంగా భావించే దేవీ నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభంమవుతున్న సందర్భంగా తగిన రక్షణ ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులున్నాయని గుజరాత్ పోలీసులు బిసిసిఐ ద్వారా ఐసిసికి విజ్ఞప్తి చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తేదీలో మార్పు చేశారు.
దీనితో పాటు మరో 8 మ్యాచ్ ల తేదీల్లో మార్పులు జరిగాయి.
- అక్టోబర్ 10న ధర్మశాలలో జరగాల్సిన ఇంగ్లాండ్- బంగ్లాదేశ్ డే-నైట్ మ్యాచ్ ను అదే రోజు డే మ్యాచ్ గా…
- అక్టోబర్ 12న హైదరాబాద్ లో జరగాల్సిన పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ ను 10వ తేదీకి
- అక్టోబర్ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా మ్యాచ్ ను 12వ తేదీకి
- అక్టోబర్ 14న ఢిల్లీ లో జరగాల్సిన ఇంగ్లాండ్ -ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ను 15వ తేదీకి
- అక్టోబర్ 14న చెన్నై లో జరగాల్సిన న్యూజిలాండ్ -బంగ్లాదేశ్ మ్యాచ్ ను 13వ తేదీకి
- నవంబర్12న పూణే గహుంజే వేదికగా జరగాల్సిన ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మ్యాచ్ ను 11కు
- నవంబర్11 న బెంగుళూరు వేదికగా జరగాల్సిన ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ ను 12కు
- నవంబర్12 న కోల్ కతా వేదికగా జరగాల్సిన ఇంగ్లాండ్-పాకిస్తాన్ మ్యాచ్ ను 11కు మార్పు చేశారు.