Friday, November 22, 2024
HomeTrending Newspakistan Elections: సైన్యం కనుసన్నల్లో పాకిస్థాన్ పార్టీలు

pakistan Elections: సైన్యం కనుసన్నల్లో పాకిస్థాన్ పార్టీలు

పాకిస్థాన్ రాజకీయాలు మరోసారి సైన్యం కనుసన్నల్లోకి వచ్చాయి. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వీకి పాకిస్థాన్‌ ప్రభుత్వం లేఖ రాసింది. పార్లమెంట్‌ గడువు మరో మూడు రోజులు ఉండగానే రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం గమనార్హం. ఎన్నికలకు మరింత గడువు తీసుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గడువుకు ముందే పార్లమెంట్‌ను రద్దు చేస్తే ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్‌ గడువు ముగిస్తే, 60 రోజుల్లోగా ఎన్నికలు జరుపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు ముందుగానే పార్లమెంట్‌ రద్దుకు ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది.

పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి మూడు సార్లు ప్రజా ప్రభుత్వాలను కూల్చిన సైన్యం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తోంది. ప్రజా నాయకులు ఎప్పుడు వచ్చినా వారిని నిలదోక్కుకుండా అస్థిరత సృష్టించటం పాక్ సైన్యానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపి ఎన్నికలు నిర్వహించేలా ఎత్తుగడ వేసింది. తోషఖాన కానుకల వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్ ను జైలులో వేసిన షాహబాజ్ ప్రభుత్వం… ఐదేళ్ళ వరకు ఇమ్రాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం వేటు వేసేలా ప్రణాలికలు అమలు చేశారు.

ఇప్పుడు జరిగే ఎన్నికలలో పాకిస్థాన్ ముస్లిం లీగ్…పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల మధ్యనే ఉంటుంది. పంజాబ్ రాష్ట్రంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీకి పట్టు ఉంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సింద్ రాష్ట్రంలో బలంగా ఉంది.  ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి ప్రజాదరణ అధికంగా ఉంది. ఇక బలోచిస్తాన్ రాష్ట్రంలో బలూచ్ తిరుగుబాటు పార్టీల దే ఆధిక్యం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎవరు అధికారంలో ఉంటె వారిదే గెలుపు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో పాకిస్థాన్ లో రాబోయే ప్రభుత్వానికి నిత్యావసరాల ధరలు, ఉగ్రదాడుల్ని అదుపు చేయటం కట్టి మీద సామే.. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్, బాల్టిస్తాన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లేమి ఆ ప్రాంత ప్రజల్లో తిరుగుబాటుకు ఉసిగోల్పుతోంది. రాబోయే ఎన్నికల్లో సైన్యానికి ఎవరు వత్తాసు పలికితే వారికే అధికార పగ్గాలు దక్కుతాయనటంలో సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్