Tuesday, June 16, 2026
HomeసినిమాAnushka: ఇకనైనా అనుష్క స్పీడ్ పెంచేనా?

Anushka: ఇకనైనా అనుష్క స్పీడ్ పెంచేనా?

అనుష్క అంటే అందానికీ .. అభినయానికి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకుంటారు. మారుమూల గ్రామాలలోని సాధారణ ప్రేక్షకులలో నుంచి మొదలుపెడితే, స్టార్ హీరోలలోను ఆమె అభిమానులు ఉన్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోలలో చాలామంది ఆమె అభిమానులుగానే చెప్పుకుంటూ ఉంటారు. అంతగా అనుష్క గ్లామర్ పరంగా .. నటన పరంగా కూడా ఆకట్టుకుంది. తన కెరియర్ ను మొదలుపెట్టిన తరువాత అనుష్క ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు .. స్టార్ డమ్ తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

స్టార్ హీరోల సరసన నటిస్తూ వెళ్లిన అనుష్క, లేడీ ఓరియెంటెడ్ కథల దిశగా వెళ్లడానికి కూడా ఎక్కువ కాలం వెయిట్ చేయలేదు. ఆ తరహా సినిమాలే ఆమెకి మరింత స్టార్ డమ్ ను తీసుకొచ్చాయి.  అలా ఆమె చేసిన సినిమాల్లో ‘అరుంధతి’ .. ‘రుద్రమదేవి’ వంటి సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగిన స్థానంలో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ‘బాహుబలి 2’ తరువాత మాత్రం అనుష్క సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ‘భాగమతి’ తరువాత కేవలం ఆమె ‘సైరా’లో మాత్రమే అతిథి పాత్రలో మెరిసింది.

ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అనుష్క చేసిన ‘సైలెన్స్’ కూడా ఆమె అభిమానులను నిరాశ పరిచింది. ఆ సినిమా తరువాత కూడా ఆమె అంతకుముందులానే సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు ఆమెను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకిగాను ఒప్పించారు. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను నిన్ననే రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా తరువాతనైనా అనుష్క వరుస సినిమాలు చేస్తుందా లేదా అనేది అనుమానమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular