రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కల నగరంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలోని హైవే పక్కన ఉన్న కార్ల సర్వీసింగ్ సెంటర్ లో ముందుగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పక్కనే ఉన్న పెట్రోల్ స్టేషన్ వరకు వ్యాపించాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. దాదాపు 250 ఫైర్ ఇంజన్లు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.