ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆధ్వర్యంలో జరగనున్న పురుషుల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్- 2023 కి రంగం సిద్ధమైంది. మరో 50 రోజుల్లో ఈ మెగా టోర్నీ మొదలు కాబోతోంది. దీనికి ఇండియా ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. తొలుత నిర్ణయించిన దానిలో కొన్ని మార్పులు చేసి ఫైనల్ షెడ్యూల్ ని గత వారం విడుదల చేశారు. అక్టోబర్ 5 న మొదలై నవంబర్ 12న ఫైనల్ మ్యాచ్ తో టోర్నమెంట్ ముగుస్తుంది. ఇండియా-పాకిస్తాన్ హై టెన్షన్ మ్యాచ్ ను ఒకరోజు ముందుకు (అక్టోబర్ 15 కు బదులు 14) జరిపారు.
క్రీడాభిమానుల్లో స్పూర్తి నింపేందుకు గాను ఈ ట్రోఫీని ఆటలో పాల్గొంటున్న వివిధ దేశాల్లో మెగా టూర్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు తాజ్ మహల్ వద్ద ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఐసిసి తన సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ’50 డేస్ టూ గో’ అనే కాప్షన్ ను కూడా పెట్టింది.