Tuesday, June 16, 2026
HomeసినిమాWhat Next?: చిరు కోసం కోలీవుడ్ డైరెక్టర్!

What Next?: చిరు కోసం కోలీవుడ్ డైరెక్టర్!

మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో చిరు నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం  విశ్రాంతిలో ఉన్న చిరు… ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై బాగా ఆలోచిస్తున్నారట. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ లో భోళాశంకర్ ని చూసేస్తారనుకున్నారు కానీ.. జనాలు తిరస్కరించారు. ఇది చిరుకు  గట్టి షాక్ అని చెప్పచ్చు. కళ్యాణ్ కృష్ణతో, బింబిసార వశిష్ట్ తో కూడా ఓ సినిమా చేయాలనుకున్నారు. ఈ రెండు సినిమాలను చిరు బర్త్ డేకు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ చిరు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది.

తాజా వార్త ఏంటంటే.. కోలీవుడ్ డైరెక్టర్ మురుగుదాస్ చిరు కోసం ఓ కథ రెడీ చేస్తున్నారట. చిరు కూడా ఈ సినిమాపై ఇంట్రస్ట్ గా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన  స్టాలిన్బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి మరో సినిమా చేయాలి అనుకున్నా కుదరలేదు. ఇప్పుడు కాంబో సెట్ అయ్యింది అంటున్నారు.

అయితే.. కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమా కంటే ముందుగా మురుగుదాస్ తో సినిమా చేస్తారా..? లేక కళ్యాణ్‌ కృష్ణతో సినిమా తర్వాత మురుగుదాస్ తో సినిమా చేస్తారా అనేది క్లారిటీ రావాల్సివుంది. మొత్తానికి భోళాశంకర్ ఎఫెక్ట్.. చిరంజీవి పై బాగా పడింది. వాట్ నెక్ట్స్ అనేది ఈసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. మరో వైపు వినాయక్ కూడా కథ రెడీ చేయిస్తున్నారు. మరి.. వినాయక్, మురుగుదాస్ ఇద్దరిలో ఎవరికి ముందుగా చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular