Wednesday, June 17, 2026
HomeసినిమాCheater: ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నక్కిన

Cheater: ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నక్కిన

యస్.ఆర్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా, బర్ల నారాయణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా  ‘చీటర్’. చంద్రకాంత్ దత్త, రేఖా నిరోషా జంటగా నటించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మొదటి ప్రచార చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన విడుదల చేశారు.

“సినిమా ఫస్ట్ లుక్ చూశాను, చాలా బాగుంది. కథ గురించి తెలుసు. కొత్తగా ఉంది. ఈ టీమ్ చేసిన ప్రయత్నం ఫలించాలని.. టీం అందరికీ మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను” అన్నారు త్రినాధ్ రావు.

డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ “మా సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా 3 సాంగ్స్ రిలీజయ్యాయి. ఈ పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందరికీ ఓ కొత్త సినిమాను చూసిన ఫీలింగ్ కలిగిస్తుందని  నమ్మకం” అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “మేము అనుకున్నట్టు సినిమా వచ్చింది, మంచి అవుట్ పుట్ వచ్చింది, ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది, సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదల అవుతుంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని నమ్మకం ఉంది” అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular