Monday, June 15, 2026
HomeసినిమాTesting Time: త్రివిక్రమ్ కి అసలైన పరీక్ష

Testing Time: త్రివిక్రమ్ కి అసలైన పరీక్ష

మహేష్ బాబు నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.  అయితే.. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు సినిమా నుంచి  తప్పుకోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.

మరో వైపు డిసెంబర్ నుంచి రాజమౌళితో చేయనున్న మూవీ వర్క్ షాపులో  మహేష్ బాబు జాయిన్ కావాలి. అందుచేత ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ కి పూర్తి చేయాలని మహేష్.. త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇది త్రివిక్రమ్ కు ఇది అసలైన పరీక్షే. ఈ చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు వీలుగా నవంబర్ కి కంప్లీట్ చేయాలి. ఇదంతా ఇప్పుడు త్రివిక్రమ్ కు పెద్ద టాస్కే. ఇటీవల విదేశాల నుంచి మహేష్ హైదరాబాద్ కు వచ్చారు.

తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. త్రివిక్రమ్ వేరే పనులు ఏమీ పెట్టుకోకుండా. ఫోకస్ అంతా గుంటూరు కారం సినిమా పైనే పెడితేనే కంప్లీట్ అవుతుంది. లేకపోతే మహేష్ అభిమానులు ఓ ఆటాడేసుకుంటారు. అలాగే కథ కూడా బాగుండాలి. ఏమాత్రం తేడాగా ఉందన్న ఫీలింగ్ కలిగించినా త్రివిక్రమ్ పని అయిపోనట్టే అంటారు. ఫస్ట్ సింగిల్ రెడీగానే ఉందట కానీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో రిలీజ్ చేయలేదు. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. మరి.. త్రివిక్రమ్ ఈ పరీక్షలో ఎంత వరకు పాస్ అవుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular