Monday, March 9, 2026
Homeస్పోర్ట్స్Asia Cup: తిలక్ వర్మకు చోటు- బుమ్రా, అయ్యర్ లకు పిలుపు

Asia Cup: తిలక్ వర్మకు చోటు- బుమ్రా, అయ్యర్ లకు పిలుపు

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కు జట్టును బిసిసిఐ ప్రకటించింది. కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యార్, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా జట్టులో తిరిగి స్థానం సంపాదించారు. హైదరాబాదీ బ్యాట్స్ మెన్, తిలక్ వర్మ కూడా బెర్త్ దక్కింది.  ప్రస్తుతం  ఐర్లాండ్ తో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో బుమ్రా, తిలక్ వర్మ ఆడుతున్న సంగతి తెలిసిందే.  కొంతకాలంగా విఫలమవుతోన్న కెఎల్ రాహూల్ కు కూడా అవకాశం ఇచ్చారు. మొత్తం 18 మందితో జట్టును ప్రకటించగా వీరిలో 17 మంది జట్టు సభ్యులుగా, మరొకరిని ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్ గా ప్రకటించారు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వీసీ), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ట్రావెలింగ్ స్టాండ్-బై ప్లేయర్ గా సంజు శామ్సన్ ను ఎంపిక చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular