Tuesday, June 16, 2026
Homeసినిమా‘ఉస్తాద్ భగత్ సింగ్’ తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 5న ప్రారంభం

‘ఉస్తాద్ భగత్ సింగ్’ తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 5న ప్రారంభం

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ తొలిసారి కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన గబ్బర్ సింగ్‌ ను అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో స్పెషల్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’తో అలరించబోతుంది. ఈ సినిమా మాసీవ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ లెంతీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం భారీ సెట్‌ను నిర్మించారు.

ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరస్తున్నారు. అయనంక బోస్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఇప్పట్లో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి రాదు అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ కోసం డేట్స్ ఇవ్వడం విశేషం. ఇది లెంతీ షెడ్యూల్ అన్నారు కానీ.. ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేదు. అయితే.. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular