‘ఏ మాయ చేసావే’ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా..?

ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలను థియేటర్లో చూడడానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 29న నాగ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లోకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అంతే కాకుండా.. ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తుండడంతో మన్మథుడు సినిమా ఇప్పుడు ఏ రేంజ్ లో ఆకట్టుకోనుంది అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఏమాయ చేసావే చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఏమాయ చేసావే చిత్రం నాగచైతన్య, సమంత.. ఇద్దరి కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. అంతే కాకుండా.. తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఏమాయ చేసావేకు ప్రత్యేక స్థానం అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా రీ రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు కూడా ఈ సినిమాకి అదే రేంజ్ లో ఆదరణ లభించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు. ఆ రోజున ఏమాయ చేసావే చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తారో..? లేకపోతే అంత కంటే ముందుగానే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తారో..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *