Monday, March 9, 2026
Homeస్పోర్ట్స్Chess World Cup: ప్రజ్ఞానంద- కార్ల్ సన్ తొలిగేమ్ డ్రా

Chess World Cup: ప్రజ్ఞానంద- కార్ల్ సన్ తొలిగేమ్ డ్రా

వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే ఆధ్వర్యంలో అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతోన్న చెస్ ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ లో  భారత యూత్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద- వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ మధ్య జరిగిన ఫైనల్స్ తొలి మ్యాచ్ డ్రా గా ముగిసింది.  ఈ క్లాసికల్ గేమ్ లో 35 ఎత్తుల తరువాత ఫైనల్ రిజల్ట్ తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ డ్రా కు అంగీకరించారు. రేపు బుధవారం రెండో ఫైనల్ జరగనుంది. దీనిలోనూ ఫలితం తేలకపోతే గురువారం ట్రై బ్రేకర్ నిర్వహిస్తారు. 

గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తరువాత మన దేశం తరఫున చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా  రికార్డు సృష్టించాడు. 

2016, 2018, 2022 సంవత్సరాల్లో జరిగిన వివిధ టోర్నమెంట్లలో ప్రజ్ఞానంద కార్ల్ సన్ పై విజయం సాధించి సత్తా చాటాడు. విశ్వనాథన్ 2000, 2002 ల్లో ఫిడే వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు. 21 ఏళ్ళ తరువాత ఈ టైటిల్ ను ప్మరజ్రోఞానంద ఇండియాకు తీసుకొస్తాడని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular