Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్IND Vs. IRE: వర్షంతో మూడో మ్యాచ్ రద్దు- చంద్రయాన్ వీక్షించిన ప్లేయర్లు

IND Vs. IRE: వర్షంతో మూడో మ్యాచ్ రద్దు- చంద్రయాన్ వీక్షించిన ప్లేయర్లు

ఇండియా-ఐర్లాండ్ మధ్య నేడు జరగాల్సిన మూడో టి 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీనితో 2-౦తో ఇండియా సిరీస్ ను గెల్చుకుంది.

మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని ఇండియా జట్టు ఐర్లాండ్ లో పర్యటించింది. డబ్లిన్ లోని ది విలేజ్ మైదానం ఈ మూడు మ్యాచ్ లకూ వేదికగా నిలిచింది.

తొలి మ్యాచ్ కు సైతం  ఆట మధ్యలో వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ప్రకారం ఇండియా రెండు పరుగులతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో 33 పరుగులతో ఇండియా గెలుపొందింది. సిరీస్ ఇండియా గెల్చుకోగా నేడు జరగాల్సిన మూడో మ్యాచ్ ఆగిపోయింది.

కాగా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మూన్ లాండింగ్ ను భారత ఆటగాళ్ళు టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రయోగం విజయవంతం కాగానే  హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular