Thursday, January 23, 2025
HomeTrending NewsHeavy Rains: హిమాచల్ కు భారీ వర్ష సూచన... రెడ్ అలెర్ట్ జారీ

Heavy Rains: హిమాచల్ కు భారీ వర్ష సూచన… రెడ్ అలెర్ట్ జారీ

కుండపోత వర్షాలతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లోని కులు జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీని వ‌ల్ల అనేక ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. తాజా ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. కులు జిల్లాలోని అన్నీ ప‌ట్ట‌ణంలో తాజాగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ఎన్డీఆర్ఎప్‌, ఎస్డీఆర్ఎఫ్ ద‌ళాలు రంగంలోకి దిగాయి.

11 జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్స్‌ పూర్తిగా మూత పడ్డాయి. ఎమర్జెన్సీ పనుల కోసం బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారింది. రోడ్లపై ఎక్కడ చూసినా వరద ప్రవాహమే కనిపిస్తోంది.. వాగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వేరు వేరు ప్రాంతాలో 12 మంది మృతి చెందారు. చాలా చోట్ల కొండచరియలు కూలి పడ్డాయి. చిన్న చిన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో పర్యాటకులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగి పడటం,, మరికొన్ని చోట్ల రోడ్ల ధ్వంసం కావడంతో హైవేపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో కులు కొండ ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక పక్క వర్షం.. మరోపక్క కొండచరియలతో ప్రమాదంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

రాబోయే రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు ఐఎండీ రెడ్ అల‌ర్ట్ వార్నింగ్ ఇచ్చింది. అన్నీ టౌన్‌లో ఉన్న భారీ బిల్డింగ్‌లు కూలిపోయాయి. అయితే రెండు రోజుల క్రిత‌మే ఆ బిల్డింగ్‌ల‌ నుంచి జ‌నాన్ని త‌ర‌లించారు. సీఎం సుఖ్వింద‌ర్ సింగ్ సూకు ఆదేశాల ప్ర‌కారం ఆ బిల్డింగ్‌ల‌ను ఖాళీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్