Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Fide World Cup: ప్రపంచ విజేత కార్ల్ సన్

Fide World Cup: ప్రపంచ విజేత కార్ల్ సన్

చెస్ ప్రపంచ కప్ కిరీటం నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ దక్కించుకున్నాడు. నేడు జరిగిన టై బ్రేకర్ పోరులో భారత యూత్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానందపై  గెలుపొంది విజేతగా నిలిచాడు.

వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే ఆధ్వర్యంలో అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతోన్న ఈటోర్నీలో   రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగిసిన సంగతి విదితమే.  తొలి రోజు  35 , రెండో రోజు 30 ఎత్తుల వద్ద ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆటగాళ్లు ఇద్దరూ  డ్రా కు అంగీకరించారు.

నేడు మొదలైన టై బ్రేకర్ మొదటి మ్యాచ్ లో  కార్ల్ సేన్ విజయం సాధించాడు. రెండో మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీనితో ప్రజ్ఞానందకు 2.5 – 1.5 తేడాతో ఓటమి తప్పలేదు.

భారత స్టార్ ప్రజ్ఞానంద ఓటమి పాలైనప్పటికీ వరల్డ్ నంబర్ ప్లేయర్ కు గట్టి పోటీ ఇచ్చి తన ప్రతిభ నిరూపించుకున్నాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular