Tuesday, March 10, 2026
HomeTrending Newsఅణుశక్తి రంగంలో సంస్కరణలకు శ్రీకారం

అణుశక్తి రంగంలో సంస్కరణలకు శ్రీకారం

ప్రజా సంక్షేమానికి వినియోగించే సంకల్పంతో అణుశక్తి రంగంలో ప్రభుత్వం అనేక వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అణుశక్తి రంగంలో ఆర్థికమంత్రి  ప్రతిపాదించిన సంస్కరణల గురించి గురువారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. క్యాన్సర్‌తోపాటు ఇతర రోగాలకు చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెడికల్‌ ఐసోటోప్స్‌ ఉత్పాదన కోసం పీపీపీ పద్దతిలో రీసెర్చి రియాక్టర్లను నెలకొల్పడం సంస్కరణలో భాగంగా చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

అలాగే ఇర్రేడియేషన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార పదార్ధాలు పాడవకుండా పరిరక్షించేందుకు పీపీపీ పద్దతిలో తగిన సదుపాయాల కల్పన జరుగుతోంది. అణు శక్తి రంగంలో రీసెర్చి, టెక్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ మధ్య గట్టి సంబంధ బాంధవ్యాలను నెలకొల్పి స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం జరుగుతంది. గడ్డల్లో మొలకల నిరోధానికి, తృణ ధాన్యాలు, కాయ ధాన్యాలు పురుగు పట్టకుండా నిరోధించేందుకు గామా ఇర్రేడియేషన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. తద్వారా ఆహార పదార్ధాలు పాడవకుండా సుదీర్ఘకాలం మన్నుతాయి. ఈ టెక్నాలజీని ఇప్పటికే అనేక ప్రైవేట్‌ సంస్థలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో 26 గామా రేడియేషన్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లు పని చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇర్రేడియేషన్‌ సదుపాయాలను పీపీపీ పద్దతిలో నెలకొల్పడం ద్వారా దిగుబడి అనంతరం వ్యవసాయోత్పత్తుల నిల్వలో జరిగే అపారనష్టాన్ని నివారించగలమని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular