ఆసియా కప్ క్రికెట్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఆరంభ మ్యాచ్ లో నేపాల్ పై 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 342 పరుగులు పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్, ఇఫ్తికార్ అహ్మద్ సెంచరీ లతో కదం తొక్కారు. బాబర్ 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151; ఇఫ్తికార్ 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 (నాటౌట్) పరుగులు చేశారు. రిజ్వాన్ 44 రన్స్ చేశాడు. ఆజామ్- ఇఫ్తికార్ లు ఐదో వికెట్ కు 214 పరుగుల రికార్డు భాగస్వామ్య నెలకొల్పారు.
నేపాల్ బౌలర్లో సోంపాల్ కామి 2, కరణ్, లమిచ్చానే చెరో వికెట్ సాధించారు,
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాక్ బౌలర్ల దెబ్బకు బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు.జట్టులో సోంపాల్ కామీ ఒక్కడే 28 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.
షాదాబ్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. షహీన్ ఆఫ్రిది, హారిస్ రాఫ్ చెరో 2; నసీమ్ షా, మొహమ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
బాబర్ అజామ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.