Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: ఆఫ్ఘన్ పై లంక విజయం

Asia Cup: ఆఫ్ఘన్ పై లంక విజయం

శ్రీలంక జట్టు ఆసియా కప్ సూపర్ -4 కు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో నేడు జరిగిన ఉత్కంఠపోరులో  2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50  ఓవర్లలో 8 వికెట్లతో 291 పరుగులు చేసింది. గ్రూప్ బి లో బంగ్లాదేశ్ ను వెనక్కి నెట్టి సూపర్ 4 లో బెర్త్ సాధించాలంటే ఈ లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో సాధించాల్సిన స్థితిలో బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ విఫలమై ఓటమిపాలైంది.

కుశాల్ మెండీస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92; పాథుమ్ నిశాంక-41; కరుణరత్నే-32; ఆశలంక-36; దునిత్ వెల్లిగలె-33; మహీశ తీక్షణ-28 పరుగులు చేశారు. . ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బడిన్ 4; రషీద్ ఖాన్ 2; ముజీబ్  ఒక వికెట్ పడగొట్టారు.

ఆఫ్ఘన్  50 పరుగులకు మూడు వికెట్లు (రహమతుల్లా గుర్జాబ్-4; ఇబ్రహీం జర్దాన్-7; గుల్బడిన్-22) కోల్పోయింది. మహమ్మద్ నబి 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 66 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 59;  రహమతుల్లా షా 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 రన్స్ సాధించారు. కరీమ్ జనత్-22;   నజీబుల్లా జర్దాన్ -23, రషీద్ ఖాన్-27 (నాటౌట్) పరుగులు చేశారు. 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

లంక బౌలర్లలో కాసున్ రజిత 4; దునిత్ వెల్లెగెలే, ధనుంజయ డిసిల్వా చెరో 2; మహీష్ తీక్షణ, మతీష పథిరణ చెరో వికెట్ పడగొట్టారు.

కుశాల్ మెండీస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్