Monday, June 15, 2026
HomeTrending NewsPushpa 2 Release Date: 2024లో ఆగష్టు 15న 'పుష్ప 2' రిలీజ్

Pushpa 2 Release Date: 2024లో ఆగష్టు 15న ‘పుష్ప 2’ రిలీజ్

పుష్ప సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్ప 2 పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకోవడంతో పుష్ప 2 పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేస్తారని.. మార్చి 22న పుష్ప 2 విడుదల కానుందని వార్తలు వచ్చాయి.

అయితే.. పుష్ప 2 చిత్రాన్ని 2024లో ఆగష్టు 15న విడుదల చేయనున్నట్టుగా మైత్రీ మూవీ మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నారంటే.. ఇప్పటి వరకు సగం షూటింగ్ మాత్రమే పూర్తయ్యిందట. ఇంకా సగం షూటింగ్ చేయాలి. పైగా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కు ఎక్కువ టైమ్ తీసుకోవాలి అనుకుంటున్నారట. అందుకనే రిలీజ్ కి ఇంత టైమ్ తీసుకున్నారని తెలిసింది. అయితే.. ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ అంతకు మించి.. అనేలా సుకుమార్ ఈ కథను రెడీ చేశారని.. పుష్ప 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular