ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 28న సలార్ సినిమాని విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాలేదని.. క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సలార్ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు. దీంతో సలార్ సినిమా రిలీజ్ డేట్స్ నవంబర్ 10, డిసెంబర్ 20, జనవరి 12 అంటూ మూడు డేట్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. తాజాగా ఈ సంవత్సరంలో సలార్ వచ్చే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తుంది.
దీంతో సలార్ సంక్రాంతికి వస్తే.. సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల పరిస్థితి ఏంటి అనే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి నాగార్జున ‘నా సామి రంగ’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, తేజ సజ్ఞ ‘హనుమాన్’ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు సలార్ సంక్రాంతికి వస్తే.. ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు వాయిదా పడడం ఖాయం. ఒక్క సలార్ మూవీ వాయిదా పడడంతో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సినిమాల దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
అయితే.. సలార్ సంక్రాంతికి రావడం కూడా కష్టమే అని.. 2024 మార్చిలో సలార్ రిలీజ్ ఉంటుందని కొత్తగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. సలార్ మేకర్స్ వాయిదా పడిందని ప్రకటించారు కానీ.. ఎప్పుడు వస్తుందో క్లారిటీగా చెప్పకపోవడంతో సలార్ న్యూ రిలీజ్ డేట్ గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఒకసారి అనౌన్స్ చేసిన డేట్ మార్చాల్సి రావడంతో ఈసారి అంతా పక్కాగా రెడీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారట మేకర్స్. మరి.. సలార్ వీఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో..? ఎప్పుడు క్లారిటీ ఇస్తారో..?